శ్రీను వైట్ల టాప్ హీరోలు అందరికీ బ్లాక్ బష్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు. అయితే మహేష్ తో తీసిన ‘ఆగడు’ ఫెయిల్యూర్ తరువాత ఈ దర్శకుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ హీరోతోను హిట్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం చిన్నహీరోలు కూడ ఇతడితో సినిమాలు చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నారు.కామెడీ టచ్ తో కన్ఫ్యూజ్ కామెడీ మూవీలను తీసే విషయంలో ఒకప్పుడు శ్రీను వైట్ల సిద్ధహస్తుడు. అయితే మారిన ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయడంలో ఈ దర్శకుడు పొరపాట్లు చేయడంతో అతడి కెరియర్ ప్రస్తుతం ఏమాత్రం బాగాలేదు. రవితేజా లేటెస్ట్ మూవీ ‘ఢమాక’ శ్రీను వైట్ల కన్ఫ్యూజ్ కామెడీ టెక్నిక్ ను అనుసరిస్తూ తీసిన సినిమా అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.


ప్రస్తుతం మాస్ మహారాజాకు ఒక భారీ హిట్ కావాలి కాబట్టి ‘ఢమాక’ మూవీని అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు టాప్ యంగ్ హీరోలు అందరూ పూర్తి హాస్యంతో కన్ఫ్యూజ్ తో కూడిన సినిమాలను చేసారు. ఆసినిమాలు అన్నీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. రవితేజా కూడ అలాంటి సినిమాలు చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే టెక్నిక్ ను రిపీట్ చేస్తూ రవితేజా ‘ఢమాక’ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈమూవీలో రవితేజా డబ్బు ఉన్న వ్యక్తిగా మరొకవైపు డబ్బులేని వ్యక్తిగా కూడ కనిపిస్తాడట.వాస్తవానికి ఇది ద్విపాత్రాభినయం కాదు కేవలం రెండు షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజా కనిపిస్తాడు అని అంటున్నారు. సగటు ప్రేక్షకుడు రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా లేదంటే సింగిల్ రోల్ లో నటిస్తున్నాడా అన్న కన్ఫ్యూజన్ లో సినిమా చూసినంత సేపు తెగ నవ్వుకుంటారు. ఇప్పుడు ఆఓల్డ్ టెక్నిక్ న్యూ టెక్నిక్ గా మాస్ మహారాజ సినిమాలో మారబోతోందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక మాస్ సాంగ్ లో రవితేజ శ్రీలీల తో వేసిన స్టెప్స్ విపరీతంగా జనానికి నచ్చేసిన విషయం తెలిసిందే..మరింత సమాచారం తెలుసుకోండి: