తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి నాగ శౌర్య గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నాగ శౌర్య ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం నాగ చైతన్య "వరుడు కావలెను" అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కొన్ని రోజుల క్రితమే నాగ శౌర్య "కృష్ణ వ్రింధా విహారి" అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా కృష్ణ వ్రిందా విహరి మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న నాగ శౌర్య మరికొన్ని రోజుల్లో ఫలానా అబ్బాయి ... ఫలానా అమ్మాయి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ మూవీ లో నాగ శౌర్య సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే నాగ శౌర్య అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో ఊహలు గుసగుసలాడే. .. జో అచ్యుతానంద సినిమాలు తెరకెక్కి మంచి విజయాలు అందుకున్నాయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: