తెలుగు చిత్ర పరిశ్రమలో నేటి స్టార్ హీరోలలో మహేష్ ఒకరు. తనదైన అద్భుత నటనతో బాల నటుడుగా ఎన్నో సినిమాలు చేసి రాజకుమారుడు సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరో స్థాయికి ఎదిగారు మహేష్. మహేష్ కు వున్నా క్రేజ్ అతడిని టాప్ స్థాయిలో ఉంచింది. ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.

మహేష్ బాబు కుటుంబంలో 2022 తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తన అన్న సురేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తాను ఎంతగానో ఇష్టపడే తండ్రి కృష్ణ వరుసగా అదే సంవత్సరం మరణించగా తీవ్ర విషాదంలో మునిగి పోయాడు మహేష్.ఆ బాధ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమా షూటింగ్ లకు అటెండ్ అవుతున్నాడు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇక మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు

తన సినిమాలకు సంబంధించిన విషయాలను కూడాట్ తన అభిమానులతో ముచ్చటిస్తాడు.ఈ విధంగానే తాజాగా మహేష్ బాబు  ఒక వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో మహేష్ బాబు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఆ వీడియోలో మహేష్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాదులో ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ జరగడం  ఎంతో గర్వకారణం అని మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని కూడా తెలిపాడట మహేష్ బాబు. అంతేకాకుండా గ్రీన్ కో కంపెనీ సీఈవో అనిల్ చలం శెట్టిని కూడా మహేష్ బాబు ప్రశంసించారు .

ఈ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని కూడా తెలిపారు మహేష్ బాబు.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 28 2023 లో విడుదల కానుందని సమాచారం.. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కూడా నటించనున్నాడు. ఇప్పటికే రాజమౌళి కథ మొత్తం సిద్ధం చేయగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా పూర్తి అవ్వగానే వెంటనే ఆ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.. కాగా ఇప్పటికే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై భారీగా అంచనాలు కూడా నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: