సినీ ఇండస్ట్రీలో నమ్మించి మోసం చేయడం మరియు ఎంత పెద్ద స్టార్ హీరోలు అయినప్పటికీ అలర్ట్ గా లేకపోతే ముంచేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు నమ్మిన స్నేహితుడే కొన్ని కొన్ని సార్లు వాళ్లని చీట్ చేయడం చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పటికే ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోలను హీరోయిన్లను మోసం చేసి అంతేకాదు డబ్బు పేరుతో నమ్మించి స్నేహం పేరుతో చీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ని కూడా అదే తరహాలో తన స్నేహితుడు అంటూ చెప్పుకొని ఒక వ్యక్తి మోసం చేశాడు అంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ఎలా మొదలైందో మనందరికీ తెలిసిందే. పేరుకి నందమూరి హీరో అయినప్పటికీ తన సొంత టాలెంట్ తో ఎంతో కష్టపడి సినిమా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. కెరియర్ పరంగా నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్క రూపాయి సంపాదిస్తూ కూడబెట్టుకుంటున్నాడు  ఎన్టీఆర్. అయితే ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మిగిలాయి.ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్కి డబ్బు కాస్త టైట్ అయింది. ఇక అలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సినిమా హిట్టుకొట్టడానికి నానా కష్టాలు పడ్డాడు. ఇక అలాంటి సమయంలో  జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు తన పక్కనే ఉంటూ

 మంచి ఫ్రెండ్ గా మంచి పేరును సంపాదించుకున్న ఆయన అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని వ్యాఖ్యలను చేశాడు. తారక్ కెరియర్ ముగిసింది అని డాన్స్లు చేయకూడదు అని జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తే హిట్ కాదు అని జోరుగా ప్రచారం చేశాడు. అంతేకాదు పలువురు డైరెక్టర్లు సైతం తారక్ గురించి నెగటివ్ గా మాట్లాడడం జరిగింది. దాని అనంతరం రాజమౌళి పుణ్యమా అని తన బాడీ షేప్ ని మొత్తం మార్చేసాడు జూనియర్ ఎన్టీఆర్. అనంతరం వరుస సినిమాల అవకాశాలను దక్కించుకుంటూ మంచి గుర్తింపును పొందాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పక్కనే ఉంటూ తనని చీట్ చేసిన వ్యక్తికి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: