సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోయిన్స్ సినిమాల్లో సాఫ్ట్ క్యారెక్టర్స్ నే కోరుకుంటుంటారు. ప్రయోగాలు చేసే హీరోయిన్లు చాలా తక్కువ మంది. అయితే ఓ హీరోయిన్ మాత్రం సరికొత్త ప్రయోగం చేసింది. ఏకంగా 32 రోజులపాటు ఓ హీరోయిన్ చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఈ 32 రోజులు తనకు జీవితంలోనే మొదటి అనుభవం అని చెప్తోంది ఆ హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు 'రితిక సింగ్'. విక్టరీ వెంకటేష్ నటించిన 'గురు' అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది రితికా సింగ్. రియల్ లైఫ్ లో కరాటే నేర్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ అనుభవంతోనే గురు సినిమాలో బాక్సర్ గా కనిపించి అదరగొట్టింది. 

దీనికంటే ముందు తమిళంలో హీరోయిన్గా ఎంట్రీ  ఇచ్చినప్పటికీ.. గురు సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నీవెవరో, కాంచన 3 వంటి సినిమాల్లో నటించింది. అయితే గత కొంతకాలంగా తెలుగు తెరపై మళ్ళీ ఈ హీరోయిన్ కనిపించలేదు. అయితే తాజాగా ఈ అమ్మడు నటించిన ఓ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈమె నటించిన తాజా సినిమాలో ఈ భామ ఓ సరికొత్త ప్రయోగం చేసింది. రితికా సింగ్ తాజాగా నటించిన చిత్రం' ఇన్ కార్'. హర్షవర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సర్వైవల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ గోయత్, మనీష్, వెంకీ కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాను ఖురేషి, సాజీద్ లు నిర్మించగా.. మార్చి 3న ఈ సినిమా విడుదల చేస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ రితికా సింగ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఇన్ కార్ సినిమా కోసం ఏకంగా 32 రోజుల పాటు ఆమె కారులోనే ఉండిపోయిందట. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా కార్ లోనే షూట్ చేశారని.. షూటింగ్ జరిగినన్ని రోజులు తలస్నానం చేయకుండా షూటింగ్ చేయాల్సి వచ్చింది అని చెప్పింది. సాధారణంగా వారంలో తాను రెండు లేదా అంతకంటే ఎక్కువగా తల స్నానం చేస్తానని.. కానీ ఈ సినిమా షూటింగ్ కోసం ఏకంగా 32 రోజుల పాటు స్నానం చేయలేదని పేర్కొంది. దీంతో తన తల నుంచి స్మెల్ వస్తున్నా పట్టించుకోకుండా షూటింగ్ కోసం కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా కోసం అంతలా కష్టపడ్డ రితికా సింగ్ కి ఖచ్చితంగా ఈ మూవీ మంచి సక్సెస్ ని అందించాలని కోరుకుందాం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: