ఇక ఆచార్య సినిమాతో తన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ని చవి చూసి దెబ్బకు మెగాస్టార్ చిరంజీవి బాగా ఢీలా పడిపోయాడు. ఎలా అయినా సరే హిట్టు కొట్టాలి అని భావించిన ఆయన గాడ్ ఫాదర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.అయితే ఎప్పుడైతే యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా చేశాడో ఆ సినిమా ఆయనకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందించడమే కాకుండా పోయిన చిరంజీవి స్టార్డంని మళ్ళీ తీసుకొచ్చింది. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మిగతా అన్ని సినిమాలను కూడా వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ రకంగా వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ సక్సెస్ తో మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ తన సత్తాచాటాడు.ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోలా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.


ఇక ఈ సినిమా దసరా 2023కి ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం తెలుస్తుంది. ఇక తదుపరి సినిమాల గురించి చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు కానీ ఆయన చాలా మంది చిత్రనిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడని తెలుస్తుంది.తమిళ డైరెక్టర్ PS మిత్రన్ డైరెక్షన్ లో సినిమా చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాని తన కూతురు సుష్మిత నిర్మిస్తుందని తెలుస్తుంది. అలాగే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో DVV దానయ్య నిర్మాణంలో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది.ఇంకా అలాగే మెగాస్టార్ చిరంజీవి కోసం ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని ఆ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఇక అలాగే మరోపక్క టాలీవుడ్ మాస్ మసాలా డైరెక్టర్ వివి వినాయక్ కూడా మెగాస్టార్ని డైరెక్ట్ చేయడానికి సరైన స్క్రిప్ట్ కోసం వేటలో ఉన్నాడని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: