సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు వస్తుంటారు ... పోతుంటారు. కానీ అందులో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని ... ఆ తర్వాత కూడా ఆ విజయాల పరంపరను అలాగే కొనసాగిస్తూ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి సంయుక్త ఒకరు. ఈ ముద్దు గుమ్మ భీమ్లా  నాయక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బింబిసారా మూవీ లో హీరోయిన్ గా నటించి మరో విజయాన్ని అందుకుంది. 

తాజాగా ఈ ముద్దు గుమ్మ ధనుష్ హీరో గా రూపొందిన సార్ మూవీ లో హీరోయిన్ గా నటించి మరో విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటికే నటించిన 3 మూవీ లతో 3 విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు సినిమాలలో పెద్దగా అందాల ప్రదర్శన చేయని ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం తన నటన తోనే ప్రేక్షకులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే సినిమా లతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా సంయుక్త అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీని కట్టుకొని ... బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను సంయుక్త తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ఇవి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: