రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ మూవీ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఆది పురుష్ మూవీ కి సంబంధించిన మొత్తం షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం మూడు మూవీ ల షూటింగ్ లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో కే జీ ఎఫ్ మూవీ ద్వారా క్రేజ్ ను తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

మూవీ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ అయినటువంటి ప్రాజెక్టు కే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీ లతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ... మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కి సంబంధించి చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లను ఇవ్వలేదు.

దానితో ఈ సంవత్సరం ఉగాది కి ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ రాబోతుంది అని గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వచ్చాయి. దానితో ప్రభాస్ అభిమానులు చాలా ఆనంద పడ్డారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ ... మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా ఈ ఉగాది కి రావడం లేదు అని తెలుస్తుంది. ఈ వార్త తెలియడంతో ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన రిద్ధి కుమార్ ... మాళవిక మోహన్ ... నిధి అగర్వాల్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: