
అది కూడా కేజిఎఫ్ మేకర్స్ హాంబలే ఫిలిం వారు నిర్మిస్తున్న ఒక మీడియం బడ్జెట్ సినిమాలో అన్నట్లుగా సమాచారం. కొత్త దర్శకుడు తో చేసే ఈ సినిమాలోని నటీనటులు ఎవరెవరు ఉన్నారు అనే విషయం తెలియదు. అయితే సినిమాలో అనుష్క మాత్రం ఒక స్పెషల్ రోల్స్ లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క గెస్ట్ రోల్ కు సైన్ చేసిందని కథ తనని ఎగ్జిట్ చేయడమే కాకుండా ప్రముఖ హొంబలే ప్రొడక్షన్ హౌస్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
నిశ్శబ్దం తర్వాత కెరియర్లో సైలెంట్ అయిన అనుష్క శెట్టి తిరిగి మళ్లీ వరుస సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.అందుకే తెలుగులో ఒక సినిమా చేస్తున్న కన్నడ సినిమాకు తన సపోర్ట్ అందిస్తున్నట్లు సమాచారం. హాంబలే ప్రొడక్షన్ హౌస్ నుంచి కేజిఎఫ్-1,2 కాంతారావు వంటి అద్భుతమైన సినిమాలు వెళ్ళబడ్డాయి .ఈ ప్రొడక్షన్ నుంచి సినిమా అంటే ఆడియన్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.అందుకే అనుష్క శెట్టి కూడా వారు నిర్మిస్తున్న సినిమా అనగానే ఆలోచించకుండా సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్ర ఆయన ఆ పాత్రకు తగ్గ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.