
గతంలో ఈ సినిమాతో నాగబాబు పూర్తిగా ఆస్తులను కూడా కోల్పోయి నడిరోడ్డున పడ్డ విషయం తెలిసిందే. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నాగబాబును ఆదుకున్నారు. ఇక మళ్ళీ నిర్మాణం వైపు కూడా నాగబాబు అడుగులు వేయలేదు. ఇప్పుడు రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ ని బట్టి..ఇప్పుడు ఈ డిజాస్టర్ మూవీకి వస్తున్న క్రేజ్ చూసి సోషల్ మీడియా మొత్తం షాక్ అవుతుంది. ముఖ్యంగా ఆరెంజ్ సినిమాకు ఎన్ని థియేటర్లలో షో వేస్తే.. అన్ని థియేటర్లు.. అన్ని షోలు ఫుల్ అవుతూ ఉండడం గమనార్హం.
ఇప్పుడు హైదరాబాదులో 54 షోలు వేయగా అందులో 41 షోలు పూర్తిగా హౌస్ ఫుల్ అయ్యాయి.. విజయవాడలో పది షోలు వేస్తే అందులో ఎనిమిది షోలు ఫుల్ హౌస్ గా నిలిచాయి.. గుంటూరు ఏరియాలో 12 షోలు వేయగా అందులో ఎనిమిది షోలు హౌస్ ఫుల్ బోర్డులను తగిలించేసాయి. వైజాగ్ లో కూడా 12 షోలు వేస్తే అందులో 11 షోలు హౌస్ ఫుల్ అవడం నిజంగా ఒక వండర్ అని చెప్పాలి.. రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఇంకా షోలు కావాలి అని సరిగ్గా ప్లాన్ చేయడం లేదు అంటూ కూడా వాపోతున్నారు. అప్పట్లో ఆరెంజ్ సినిమా తెచ్చిన నష్టాన్ని ఇప్పుడు నాగబాబుకు పూర్తిస్థాయిలో అందించేటట్టు కనిపిస్తోంది. అయితే ఇదంతా క్రేజ్ ఆయనకు ఆస్కార్ రావడమే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా అక్కడ ఆస్కార్ ఇక్కడ నాగబాబుకు లాభాలను తెచ్చిపెడుతోంది అనడంలో సందేహం లేదు..