బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ నటుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ "ఆర్ ఆర్ ఆర్" లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

మూవీ లో అజయ్ దేవగన్ పాత్ర నిడివి తక్కువే ఆయనప్పటికీ తన పాత్రతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను అజయ్ దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అజయ్ దేవగన్ "భోళా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అజయ్ దేవగన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యూ / ఏ సర్టిఫికెట్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ని కూడా లాక్ చేసింది  ఈ సినిమా 144 నిమిషాలు (2 గంటల 24 నిమిషాల) నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: