కొన్ని సంవత్సరాల పాటు వరస ఫ్లాప్ లతో సతమతమైన రవితేజా ‘ధమాకా’ మూవీ సూపర్ సక్సస్ తో తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు. ఏప్రియల్ మొదటివారంలో విడుదలకాబోతున్న ‘రావణాసుర’ మూవీతో మాస్ మహారాజ తన హిట్ ట్రాక్ ను కొనసాగించగలడా లేదంటే ఫ్లాప్ ను తెచ్చుకుంటాడ అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి.ప్రస్థుతం ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతోంది. టాప్ హీరోలు అంతా ఇప్పటికే తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఇప్పుడు అదే సాంప్రదాయం కొనసాగించడానికి రవితేజా కు అవకాశం లభించినా అతడు ఎందుకు పెద్దగా ఆశక్తి కనపరచలేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. లేటెస్ట్ గా రవితేజా సోదరుడు రఘు కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న మూవీ లాంచింగ్ ఫంక్షన్ ఉగాది రోజున జరిగింది.ఈ ఫంక్షన్ కు చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు వచ్చారు. అయితే ఆ ఫంక్షన్ లో ఎక్కడా రవితేజా కనిపించలేదు. తమ్ముడు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న ఫంక్షన్ కు మాస్ మహారాజా డుమ్మా కొట్టడం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆశ్చర్యపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రవితేజా కుటుంబం నుండి హీరో వస్తున్నాడు అంటే చాల హడావిడి జరగాలి కానీ అలాంటి హడావిడి ఎక్కడా జరగలేదు అని అంటున్నారు.దీనితో సెంటిమెంట్ కారణంగా రవితేజా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నడా లేదంటే మరేదైనా కారణం ఉందా మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈవిషయం పై మరొక విధంగా స్పందిస్తున్నారు. రవితేజాకు పెద్దగా పబ్లిక్ ఈవెంట్స్ కు వచ్చే అలవాటు లేదనీ అందువల్లనే తన సోదరుడి కుమారుడి ఈవెంట్ కు కూడ దూరంగా ఉన్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే రవితేజ ట్విటర్లో మాత్రం మాధవ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టడంతో ఇవన్నీ ఊహాగానాలే అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది..  మరింత సమాచారం తెలుసుకోండి: