టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఫస్ట్ టైం పాన్ ఇండియా హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా దసరా.ఇక మొదటి సారి పూర్తిగా నాని ఊర మాస్ లుక్ లో సినిమా చేస్తుండటం, అలాగే ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్స్ కూడా రా అండ్ రస్టిక్ గా ఉండి అభిమానులని ఇంకా అలాగే ప్రేక్షకులని సినిమా కోసం వెయిట్ చేసేలా చేశాయి. ఇక పాటలు కూడా బాగా హిట్ అయి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ రిపీట్ గా వినిపిస్తూనే ఉన్నాయి.ఇక న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే మొదటి సారి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా దసరా. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా బాగా ప్రమోషన్స్ చేస్తూ రిలీజ్ చేయబోతున్నాడు.


దీంతో చిత్రయూనిట్ అంతా కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. శ్రీరామనవమి సందర్భంగా దసరా సినిమాని మార్చ్ 30 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని భాషల్లో బుకింగ్స్ కూడా ఈ సినిమా ఓపెన్ అయ్యాయి. సినిమాపై మంచి అంచనాలే ఉండటంతో సినిమా చూడటానికి అభిమానులు, సినిమా ప్రేమికులు ఇంకా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక నాని ఫ్యాన్స్ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు.అయితే గతంలో కొన్ని సినిమాలకు టికెట్ రేట్ ఏకంగా 295 పెట్టడంతో చాలా సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దెబ్బ తిన్నాయి. 


అంత పెట్టి సినిమా చూడటం కంటే ఓటీటీలోకి వచ్చాక చూసుకోవడం చాలా మంచి పని అని అంతా అభిప్రాయపడ్డారు. దీంతో కొన్ని సినిమాలు బాగున్నా కూడా టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కలెక్షన్స్ రాలేదు. ఈ సంగతి అర్థమయ్యాక  200 రూపాయలు టికెట్ రేట్ పెడుతున్నారు.అలాగే మల్టీప్లెక్స్ లో కూడా 200 ఉంటుంది. కొన్ని సినిమాలు అయితే 175 లకే తమ సినిమా టికెట్ రేట్లని పెట్టడం జరిగింది. ఇటీవల వచ్చిన ఏ సినిమా టికెట్ రేటు కూడా 200 రూపాయలు దాటలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు నాని దసరా సినిమాకు ఏకంగా 295 రూపాయల టికెట్ రేటుని పెట్టాడు.  


మల్టిప్లెక్స్ లో 295 అదే ఎక్కువ అయితే ఈ సినిమాకి ఏకంగా 350 పెట్టారు. దీంతో చాలా మంది అంత రేటు పెట్టి టికెట్ కొనాలంటే ఎంతగానో ఆలోచిస్తున్నారు. బుకింగ్స్ అయితే పర్వాలేదు కానీ మరీ పాన్ ఇండియా రేంజ్ లో అయితే లేవు. దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఈ సినిమాని కీర్తి సురేష్ తమిళ్ లో పెద్దగా ప్రమోట్ చెయ్యట్లేదు. ఆమె ఇంతవరకు ఈ సినిమా గురించి ఏ ఒక్క తమిళ్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు.అందువల్ల పాన్ ఇండియా రేంజ్ బుకింగ్స్ అవ్వలేదు. ఇక USA లో ప్రీ సేల్స్ విషయానికి వస్తే 275 K డాలర్స్ మాత్రమే బుకింగ్స్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: