ఇక జగపతిబాబుకు కూడా తెలుగులో వరుస అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ్ హిందీ వంటి చిత్రాలలో కూడా నటిస్తున్నారు. ఇటీవల తాను పుష్ప-2 సినిమాలో కూడా నటిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది ఈ చిత్రంలో జగపతిబాబు విదంగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. పుష్ప -2 చిత్రంతోపాటు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కూడా జగపతిబాబు నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో తన పాత్ర కాస్త రాగడ్ లుక్కులో ఉంటుందని తెలిపారు జగపతిబాబు.ఈ మధ్యకాలంలో చేసిన పాత్రలకు మంచి రెస్పాన్స్ లభిస్తూనే ఉంది. అందుకే ఈ సినిమాలో కూడా ఆయన పాత్ర బాగుంటుందని మహేష్ అభిమానులు కాస్త నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి మహేష్ త్రివిక్రమ్ మధ్య గొడవలు మొదలయ్యాయని అందుకే ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోందని వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయం పైన నిర్మాత నాగ వంశీ తన ట్విట్టర్ నుంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు జగపతిబాబు కూడా మహేష్ సినిమాలు విలన్ గా నటించబోతున్నానంటూ తెలియజేయడంతో ఈ సినిమాకి మరింత హైప్ ఏర్పడుతోంది. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.