దళపతి విజయ్ కి తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు టాలీవుడ్ లో సైతం పండగ వాతావరణం నెలకొంటుంది. అంతేకాదు ఆయన సినిమాలో 100 కోట్ల మార్క్ను దాటడం అంటే ఆయనకి పెద్ద విషయం ఏమీ కాదు. రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఆయన సినిమా విడుదలైందంటే చాలు ఊహించని విధంగా వంద కోట్లకు పైగానే ఆయన సినిమా వసూలను రాబడతాయి. ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో కలిసి వరస్ట్ అనే సినిమా చేశాడు విజయ్. ఇక ఈ సినిమా తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది.

సినిమా ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల విడుదలైన బ్లడీ స్వీట్ అంటూ సింగిల్ డైలాగ్ తో ఈ లింక్స్ తో అభిమానులతో పాటు ప్రేక్షకుల సైతం ఎంతో ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే తాజ సమాచారం ప్రకారం ఈ సినిమా తర్వాత విజయ్ లియో తరువాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సమాచారం ప్రకారం నాగచైతన్యతో కష్టడి సినిమా చేసిన వెంకట్ ప్రభు తో తన తదుపరి సినిమాని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో రాబోయే సినిమాపై త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: