ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల రీ రిలీజ్ మ్యానియా బాగా ఏర్పడింది. లేటెస్ట్ గా జరిగిన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజునాడు రీ రిలీజ్ చేసిన ‘సింహాద్రి’ మూవీ పట్ల తారక్ అభిమానులు చూపించిన మ్యానియాను పరిసీలిస్తే టాప్ హీరోల కోసం అతడి అభిమానులు ఏదైనా చేస్తారు అని అనిపిస్తుంది. ఈమూవీకి తెలుగు రాష్ట్రాలలో 4 కోట్లకు పైగా కలక్షన్స్ రావడం చూస్తే టాప్ హీరోల క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.


కేవలం ఈ రీ రిలీజ్ ట్రెండ్ టాప్ హీరోలకు మాత్రమే పరిమితం కావడం లేదు చనిపోయిన సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్ళకు మోసగాడు’ మూవీని కృష్ణ పుట్టినరోజునాడు భారీ పబ్లిసిటీతో రీ రిలీజ్ చేయడంతో పాటు ఆ మూవీ ప్రమోషన్ కోసం ఏకంగా మహేష్ రంగంలోకి దిగడంతో మహేష్ అభిమానులు కృష్ణ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఇచ్చే ఆస్కారం కనిపిస్తోంది. వాస్తవానికి ఈ పాత సినిమాలు అన్నింటిని ఎప్పుడో ఒకటికి రెండు సార్లు టాప్ హీరోల అభిమానులు అప్పట్లో ధియేటర్లలో అలాగే యూట్యూబ్ లో ఒకటికి పది సార్లు  చూసినవే.


అయినప్పటికీ తమ హీరోల సినిమాలు రీ రిలీజ్ అంటే అభిమానులు పూనకం వచ్చిన వారిలా ఊగిపోవడమే కాకుండా విపరీతమైన ఆనందాన్ని పొంది తాము చూస్తున్న ధియేటర్లలోని కుర్చీలు అదే విధంగా సిల్వర్ స్క్రీన్ ను విపరీతమైన ఆనందంతో పాడు చేయడమే ధియేటర్లలో స్క్రీన్స్ చింపడం మధ్య మధ్యలో కేకలు వేస్తూ టాప్ హీరోల అభిమానులు చేసిన హంగామా చూసి తమ ధియేటర్లు ఎక్కడ పాడైపోతాయో అన్న టాప్ హీరోల సినిమాల రీ రిలీజ్ అంటే ధియేటర్లు ఇవ్వడకి భయపడిపోవడమే కాకుండా తమ ధియేటర్లను పాడుచేసిన హీరోల అభిమానుల పై కేసులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడటం అత్యంత దురదృష్టకరం అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. ఈ సమస్య కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అమెరికా లాంటి దేశాలలో కూడ కనపడటం అత్యంత ఆశ్చర్యంగా మారింది..మరింత సమాచారం తెలుసుకోండి: