బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరో గా ... ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలో నటించి తన అద్భుతమైన నటన తో హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను ఏర్పరచుకున్న అజయ్ దేవ్ గన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే హిందీ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే తెలుగు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

మూవీ లో అజయ్ దేవ్ గన్ పాత్ర నిడివి చాలా తక్కువ అయినప్పటికీ అందులోనే ఈ నటుడు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అజయ్ దేవగన్ హీరోగా "భోళా" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇతనే స్వీయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగానే అలరించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ ని అమెజాన్ సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మీ ఆయన వారు ఉంటే అమెజాన్ ప్రైమ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: