బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు అలాగే బ్రేకప్‌లు ఎంతో కామన్ . పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన జంటలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రేమలో చాలాకాలం మునిగితేలి పెళ్లి చేసుకున్నాక విడిపోయిన జంటలు కూడా ఎన్నో ఉన్నాయని తెలుస్తుంది..తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో గురించి ఓ క్రేజీ న్యూస్‌ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌ ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా దూరంగా ఉన్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సింగ్ చద్దా ఘోర పరాజయం చెందడంతో ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.

 

ఇదిలా ఉంటే ఆయన త్వరలోనే మూడో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. దంగల్‌ సినిమాలో అమీర్‌కు కూతురిగా నటించిన ఫాతిమా సనాషేక్‌ తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్‌ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని పలుమార్లు మీడియా కంట కూడా పడ్డారు. ఇటీవల అమీర్‌ కూతురు ఇరాఖాన్‌ ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో కూడా ఫాతిమా సందడి చేసింది.

తాజాగా ఇద్దరూ కలిసి ఉన్న ఓ వీడియో నెట్టింట ఒకటి లీక్‌ అయ్యింది. ముంబైలో వీరిద్దరూ కలిసి పికిల్‌ బాల్‌ ఆడారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ గా మారడం తో మరోసారి అమీర్‌ ఖాన్‌ పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌ గా మారాయి.

దీనికి తోడు అమీర్‌ ఖాన్‌ త్వరలోనే దంగల్‌ నటిని పెళ్లాడనున్నట్లు ప్రముఖ సినీ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు కూడా కామెంట్ చేశాడు. కాగా 1986లో రీనా దత్తను పెళ్లి చేసుకున్న అమీర్ 2002లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకోగా 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది.దంగల్ సినిమాలో కూతురిగా నటించిన ఈ భామ థగ్స్ అఫ్ హిందూస్తాన్ సినిమాలో అమీర్ ఖాన్ తో జంటగా నటించింది కానీ ఆ సినిమా అంతగా ఆశించిన విజయం అందుకోలేదు…

మరింత సమాచారం తెలుసుకోండి: