టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ సినిమాలోని కొన్ని పాటలు ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ సాంగ్స్. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి వారం నెగిటివ్ టాక్ తో ప్రారంభమైంది. కానీ చిన్నగా ఆ నెగిటివిటి కాస్త రెండవ వారం తర్వాత సునామి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టించింది ఈ సినిమా. అయితే అప్పటివరకు ఆల్ టైం రికార్డ్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఖుషి రికార్డును బ్రేక్ చేసింది ఈ సినిమా.

అయితే ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడానికి కొంతమంది స్టార్ హీరోలకి దాదాపుగా 10 ఏళ్లకు పైగానే పట్టింది. అయితే ఈ సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 16 కోట్లకు పైగానే వసూళ్లను సాధించిందని అంటున్నారు.  ఈ సినిమాలో హీరోగా నితిన్ ఎంతగా ఆకట్టుకున్నాడో అంతకంటే ఎక్కువగా విలన్ గా నటించిన గోపీచంద్ కి ఎక్కువ పేరు వచ్చింది అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో గోపీచంద్  విలనిజం ఎంత అత్యద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క విలన్ పాత్ర చేసినందుకే ఆయనకి ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఏర్పడడం అనేది ఒక్క గోపీచంద్ కి మాత్రమే సాధ్యమైంది.

అయితే ముందుగా ఈ సినిమాలో హీరోగా నితిన్ మరియు గోపీచంద్ ని అనుకోలేదట. ముందుగా ఈ సినిమాలోని హీరో పాత్ర కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు అల్లరి నరేష్ పిల్లను అనుకున్నాడట డైరెక్టర్ తేజ .అంతే కాదు ఈ సినిమాతో అల్లరి నరేష్ ని విలన్ గా పరిచయం చేయాలనుకున్నాడట. కానీ వారిద్దరికీ ఈ సినిమా కథ నచ్చలేదు. దీంతో నితిన్ ని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించాడు .అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని అనుకున్నారట .కానీ అప్పుడు ఆయన డేట్స్ ఖాళీ లేక ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో గోపీచంద్ కి ఈ అవకాశం వచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: