వరుస హిట్లతో టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా చాలా స్పీడ్ గా షూటింగ్‌ను జరుపుకుంటోంది.ఇది అలా ఉంటే ఈ సినిమా నుంచి మే 31న ఓ సూపర్ అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా నుంచి విడుదల అయిన మాస్ స్ట్రైక్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డుని సొంతం చేసుకుందని ప్రకటించింది టీమ్. అంతేకాదు ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ ఇంకా దూసుకుపోతూ అదరహో అనిపిస్తుంది. ఇప్పటికి 26 మిలియన్ పైగా వ్యూస్ రాబట్టి దూసుకుపోతుంది.ఇక ఈ సినిమా అన్ని కార్యక్రమాలను  పూర్తి చేసుకుని  వచ్చే సంక్రాంతికి అంటే 2024 జనవరి 13 న భారీగా విడుదల కానుంది.ఇక ఈ సినిమాలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం తెలుస్తోంది.


అక్షయ్ కోసం త్రివిక్రమ్ ఒక బలమైన పాత్ర రాశాడని సమాచారం తెలుస్తుంది. అయితే అది విలన్ పాత్ర.. లేక ఇంకోటా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ ను కూడా వేస్తున్నారు. ఇక జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సెట్ లో షూటింగ్ అనేది జరగనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్దే, శ్రీలీల హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఈ సినిమాకి ఫ్యాన్స్ ఊహించినట్టుగానే గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో మహేష్ గుంటూరు యాసతో ఖచ్చితంగా అదరగొడతాడని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా వున్నారు. వారికి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకుండా ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం ఖాయమని మూవీ యూనిట్ హామీ ఇస్తున్నారు.మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి ఆల్ టైం రికార్డులని సెట్ చేస్తుందో..సర్కారు వారి పాటతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ ఈ సినిమాతో కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: