టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కి రోల్స్ చేస్తోంది ప్రియమణి. ఇటీవల కస్టడీ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన ప్రియమణి దాంతో పాటు వెబ్ సిరీస్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా చేస్తూ బిజీగా మారింది.ఇక ఈమె వ్యక్తి గత జీవిత విషయానికి వస్తే హీరోయిన్గా ఫెడ్ ఆడౌట్ అయినప్పటికీ ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియమణి. అయితే తన భర్తకి ఇది రెండవ వివాహం. ఈమె కంటే ముందే ఆయన ఒక యువతిని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. 

దాని తర్వాత ప్రియమణి ముస్తఫా రాజ్ ఇద్దరు ప్రేమించుకుని చాలా సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరి వివాహం చేసుకొని చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ వీరిద్దరికీ సంతానం మాత్రం లేదు. ఇక ప్రియమణికి చాలా కాలంగా తన భర్త దూరంగానే ఉంటున్నాడు. వ్యాపార నిమిత్తం తన భర్త విదేశాల్లో ఉంటే ప్రియమణి తన కెరీర్ కోసం హైదరాబాదులోనే ఉంటూ అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. అయితే ఆదివారం రోజు ప్రియమణి తన 39వ పుట్టినరోజుని ఫ్యామిలీతో చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది. కేక్ కట్ చేసి చాలా సింపుల్ గా తన బర్త్డే నీ జరుపుకుంది.

 తన కుటుంబ సభ్యులు అందరూ ఉన్నప్పటికీ స్పెషల్ డే నాడు మాత్రం ప్రియమణి పక్కన తన భర్త లేడ. భర్తను బాగా మిస్ అయిన ఆమె తనకి సంబంధించిన బర్త్ డే ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ మిస్ యు ముస్తఫా రాజ్ అంటూ ఎమోషనల్ కామెంట్ పెట్టింది ప్రియమణి .దీంతో ఆ పోస్ట్ ని చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ ని పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రియమణి కి భర్త ఉన్నా లేనట్లే అని.. ఇష్టమైన రోజుల్లో కూడా భార్య భర్తలు ఇద్దరూ కలిసి లేకపోతే ఎలా అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్..!?

మరింత సమాచారం తెలుసుకోండి: