టాలీవుడ్లో నటసింహ బాలయ్య ఫ్యాక్షన్ డ్రాప్లో నటించిన చిత్రాలలో నరసింహనాయుడు సినిమా కూడా ఒకటి. బాలయ్య కెరియర్ లోనే ఎన్నో ఫ్యాక్షనిస్ట్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇప్పటికే కూడా ఇలాంటి జోనర్లో పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు బాలయ్య. జూన్ 10వ తేదీన బాలయ్య బర్తడే సందర్భంగా అభిమానులు పుట్టినరోజున నరసింహనాయుడు సినిమాని రీ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను సైతం సృష్టించింది ఇప్పుడు వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం.


బాలకృష్ణ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆకట్టుకుంది. 2001 జనవరి 11న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కావడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద రూ .20 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు అందుకొని ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అంతేకాకుండా 100 సెంటర్లలో వంద రోజులు ఆడి ఒక చరిత్రను కూడా సృష్టించింది. అలాగే 150   అండ్ 200 రోజులు ఆడి పలు రికార్డులను కూడా పలు సెంటర్లలో సృష్టించింది. ఈ సినిమాతో ఫ్యాక్షన్ డ్రాప్ చిత్రాలకు మరింత క్రేజీ ఏర్పడిందని చెప్పవచ్చు


సినిమా కథ మాటలు అందించింది పరుచూరి బ్రదర్స్ బాలయ్యతో చెప్పిన డైలాగులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలోని హీరోయిన్స్ గా సిమ్రాన్ ప్రీతి జింగానియా నటించారు సంగీతాన్ని మణిశర్మ అందించారు.. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు కూడా అప్పట్లో తెగ సందడి చేశాయి. ఈ సినిమాకి బాలకృష్ణకు మొదటిసారి నంది అవార్డును అందుకోవడం జరిగింది. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ అనిల్ రావు పూరి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించక బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటిస్తోంది. మరి రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: