అయితే త్రివిక్రమ్ మటుకు తనకు కంఫర్ట్ జోన్ లో ఉండే హీరోలతోనే సినిమాలు చేయడానికి ఇష్టపడతాడు కానీ తనకు పరిచేయంలేని పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి ఆశక్తి కనపరచదు. అందువల్లనే త్రివిక్రమ్ పవన్ మహేష్ అల్లు అర్జున్ లతో మళ్ళీమళ్ళీ సినిమాలు చేయడానికి ఆశక్తి కనపరుస్తూ ఉంటాడు. దీనికితోడు త్రివిక్రమ్ కు పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలను తీయాలి అన్నకోరిక ఉంది అని అంటారు.
త్రివిక్రమ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి సుకుమార్ లు పాన్ ఇండియా స్థాయి దర్శకులుగా మారి అత్యంత భారీ సినిమాలు తీస్తూ ఉంటే త్రివిక్రమ్ మటుకు ఇప్పటికీ తన సినిమాల స్థాయిని పెంచుకోలేకపోతున్నాడు అన్నకామెంట్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ పాన్ ఇండియా ఆశలను అల్లు అర్జున్ నెరవేర్చే ప్రయత్నం చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ తరువాత చేయబోయే సినిమా విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
మళ్ళీ బన్నీ బోయపాటిల కాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే బన్నీ మనసులో మాత్రం వేరే ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు. ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘పుష్ప 2’ షూటింగ్ ఈసంవత్సరం చివరకు పూర్తి అయ్యే అవకాశం ఉండటంతో వచ్చే సంవత్సరం జనవరి నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ మూవీ చేయాలని అనుకుంటున్నట్లు టాక్. వాస్తవానికి త్రివిక్రమ్ కు కూడ ఒక భారీ యాక్షన్ మూవీ చేయాలని ఆశపడుతున్నాడు అని అంటారు. అయితే అతడు ఇలాంటి జోనర్ సినిమాలను తీయలేడు అన్న ప్రచారం మధ్య బన్నీ త్రివిక్రమ్ కు ఒక భారీ యాక్షన్ మూవీ అవకాశం ఇస్తే అతడికోరిక నెరవేరినట్లే అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి