ఈ సినిమాతో అఖిల్ క్రేజ్ మారిపోతుంది అని అభిమానులు భావించగా అందుకు విరుద్ధంగా ఈ సినిమా ఫ్లాప్ అవడంతో పాటు అఖిల్ ను మరింత పాతాళంలోకి నెట్టేసింది. కాగా అఖిల్ కెరియర్ లో ఇంకొక ఫ్లాప్ సినిమా పడింది అంటే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పక తప్పదు. అఖిల్ కెరీర్‌లో ఎదైనా చెప్పుకోదగ్గ సినిమా ఉందంటే అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పవచ్చు.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అఖిల్ కోసం ఒక మంచి కథ రెడీ చేసారట.ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పెద కాపు చిత్రంతో బిజీగా ఉన్నారు. కొత్త నటీనటులతో ఈ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే అఖిల్‌తో మూవీ మొదలుపెట్టనున్నాడని సినీ ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అఖిల్ కోసం ఒక పవర్ పుల్ కథ సిద్దం చేశాడట.
అది మాస్ యాక్షన్ చిత్రం అని తెలుస్తోంది. దానికోసం అఖిల్ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టినట్టు నెట్టింట చర్చలు కూడా మొదలయ్యాయి. శ్రీకాంత్ ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలు చేయలేదు. తనదంతా ఫ్యామిలీ, లవ్ స్టోరీస్ సినిమాలే మరి యాక్షన్ కథను తీయగలడా అని కొందరు సందేహ పడుతున్నారు.ఎలగైన అఖిల్‌కు ఒక మంచి హిట్ సినిమా కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం. కథల విషయంలో దిల్ రాజుకు మంచి అనుభవం ఉంది. తనకు కథ నచ్చిందంటే సినిమా 50 శాతం హిట్ అయినట్టే. మరి అఖిల్ ఈ సినిమాతో అయినా సక్సెస్ను అందుకుంటాడో లేదో చూడాలి మరి. ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే అఖిల్ సినిమా నాకు గుడ్ బై చెప్పక తప్పదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి