డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తూ ఉన్నారు. అన్ని బాగుంటే ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు సలార్ సినిమా వచ్చేది.. కానీ ఈ సినిమా డబ్బింగ్ ప్రమోషన్స్ కారణాల చేత ఈ సినిమా పోస్ట్ పోన్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సలార్ సినిమా అనేకసార్లు వాయిదా పడడంతో అభిమానుల సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. తాజాగా సలార్ సినిమా రిలీజ్ డేట్ పైన పలు డేట్లు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.


ప్రభాస్ అభిమానులు సలార్ సినిమా రిలీజ్ డేట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం నవంబర్ 24 లేకపోతే డిసెంబర్ 22న నో ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. లేకపోతే కచ్చితంగా జనవరి 11న రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ఫోన్ వరకు పూర్తి కాలేదని సీజీ వర్క్ ఇంకా పెండింగ్లో ఉండడంతో ఈ సినిమాని వాయిదా చేస్తున్నట్లు సమాచారం.


నిన్నటి రోజున సలార్ సినిమా వాయిదా పడినట్లుగా తెలియజేయడం జరిగింది.కేవలం కొన్ని అనవార్య కారణాలవల్ల సెప్టెంబర్ 28న రిలీజ్ కాలేదంటూ తెలియజేసింది చిత్ర బృందం. ప్రభాస్ ఇదే కాకుండా కల్కి సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లేవల్లో నిర్మించడం జరుగుతోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ చిత్రమే కాకుండా డైరెక్టర్ సందీప్  సందీప్ వంగ తో స్పిరిట్ సినిమా డైరెక్టర్ మారుతీ తో ఒక సినిమాని తెరకెక్కించే పనిలో పడ్డారు ప్రభాస్. కల్కి సినిమా వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: