టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మొదట సైడ్ క్యారెక్టర్లలో కొన్ని సినిమాలలో నటించి అర్జున్ రెడ్డి సినిమాతో బాగా ఫేమస్ అయ్యి ఆ వెంటనే గీతగోవిందం సినిమాతో మంచి స్టార్ డమ్ ను అందుకున్నారు.అందుకు తగ్గట్టుగానే విజయ్ మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇంకా తన రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే పెంచేశారు విజయ్ దేవరకొండ. దీంతో టైర్-2 హీరోలలో చోటు సంపాదించుకున్నాడు విజయ్.అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ నటించిన గత సినిమాలు మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయి.. దీనివల్ల ఆ సినిమాలు కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాయి. డియర్ కామ్రేడ్ 12 కోట్ల నష్టం ఇచ్చింది. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ 21 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది.


పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా అయితే ఏకంగా 60 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం. ఇటీవల సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా పాజిటివ్ టాక్ వచ్చిన ఎందుకో కలెక్షన్ల పైన పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో  సినిమాకి 10 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం.అయితే తమిళ్ లో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్టుగా నిలిచింది. ఇక విజయ్ ఫ్రెండ్ మరో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అనుష్కతో చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మాత్రం తమిళనాడులో వాష్ ఔట్ అయినా తెలుగులో మాత్రం మంచి లాభాలు అందుకొని హిట్ గా నిలిచింది. ఇలా విజయ్ దేవరకొండ ఫ్రెండ్ నవీన్ సినిమాలు వరుసగా హిట్లు అవుతున్నాయి. కానీ విజయ్ సినిమాలు కోట్ల నష్టంతో నిర్మాతలకు తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో ఒక సినిమా ఇంకా డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితేనే విజయ్ కెరియర్ గాడిలో పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: