సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. సౌత్ ఇండియాలో స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించకుండా ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయి మరి నటిస్తుంది కీర్తి సురేష్. గత ఏడాది ఈమె నటించిన సర్కారు వారి పాట సినిమాలో తన గ్లామర్ తో మంచి మార్కులను కొట్టేసిన కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈ సినిమా కంటే ముందే ఆమె నటించిన సానికయుధం అనే సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా లో సైతం తన పాత్రలో ఒదిగిపోయి మరి అద్భుతంగా నటించింది.

స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నప్పటికీ ఎటువంటి పాత్రలోనైనా నటించడానికి వెనుకాడదు కీర్తి సురేష్. ఆ తర్వాత పెంగ్విన్ సినిమాలో సైతం గర్భవతిగా నటించి మెప్పించింది. అనంతరం మర్కార్ అనే సినిమాలు సైతం విదేశీయుడిని ప్రేమించే అమ్మాయిగా ఆ పాత్రలో అద్భుతంగా నటించింది. ఇలా కీర్తి సురేష్ ఎటువంటి పాత్రలోనైనా చాలా అద్భుతంగా నటించగలదు. దానితోపాటు సీనియర్ హీరోల సరసన సైతం చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే అలా వచ్చిన సినిమాలే అన్నాత్హై, భోళా శంకర్. రజనీకాంత్ చిరంజీవి వంటి స్టార్ హీరోలకు కీర్తి సురేష్ చెల్లెలిగా నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా నిలిచాయి.

ఇక ఈ రెండు సినిమాలు అటు స్టార్ హీరోల కెరియర్ లో కూడా భారీ డిజాస్టర్ లను మూటగట్టయ్. అయితే ఈ సినిమాలలో నటించడం కీర్తి సురేష్ కి చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది కానీ ఆ సినిమాలు విడుదలైన తర్వాత పరిస్థితులు అనుకున్నట్లుగా లేవు. దీంతో కీర్తి సురేష్ ఇకమీదట ఇటువంటి సినిమాలు చేయొద్దు అని చెల్లెలి పాత్రలలో అసలు నటించదు అని ఫిక్స్ అయినట్లుగా తెలియజేస్తోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలను తప్ప చెల్లెలి పాత్రలను ఇకమీద చేయకూడదు అని కీర్తి సురేష్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: