తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది త్రిబుల్ ఆర్ సినిమా. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని నాటు నాటు పాటకి గాను ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటికి ఆస్కార్ అవార్డు రావడంతో అందరూ ఔరా అన్నారు. ఇది ఒప్పుతో పలువురు దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆస్కార్ రేంజ్ సినిమాలను చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ కోసం సినిమా ఎంపిక ఇప్పటినుండి ప్రారంభించారు. ఇక ఇప్పటివరకు 22 సినిమాలు అధికారికంగా దరఖాస్తు

చేసుకున్నట్లుగా కూడా ప్రస్తుతం సమాచారం వినబడుతుంది. అయితే వాటిల్లో రెండు తెలుగు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ రెండు తెలుగు సినిమాలు మరేమో కాదు బలగం, దసరా. ఈ రెండు సినిమాలు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాటితో పాటు ది కేరళ స్టోరీ, గదర్ టు, రకి ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, జ్విగాటో, ది స్టొరీ టెల్లర్ వంటి సినిమాలు సైతం ఆస్కార్ బరిలో పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రముఖ ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి నేతృత్వంలో 17 మంది సభ్యులతో కలిసి ఆస్కార్ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్

 ఎంట్రీ కోసం దరఖాస్తు చేస్తున్న సినిమాలని పరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో సైతం బలగం జ్విగాటో, విడుదలై 1 వంటి సినిమాల్లో ఒకటి ఆస్కార్ ఎంట్రీ సాధించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వార్త విన్న వారందరూ ఖచ్చితంగా మన బలగం సినిమాకి ఈ అవార్డు వస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల అవార్డులను సాధించిన బలగం సినిమా ఇప్పుడు ఆస్కార్ రేసులో ఉండడంతో తెలుగు అభిమానులందరూ ఎంతో గర్విస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. బలగం ఆస్కార్ రేసులో ఉండడంతో తెలుగు అభిమానులందరూ ఎంతో గర్విస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వారాలవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: