అప్పట్లో టాలీవుడ్ లో భక్తిరస చిత్రాలు చాలానే వచ్చేవి. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం అలాంటి సినిమాలు చాలా తగ్గిపోయాయనే చెప్పొచ్చు. రీసెంట్ గా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ఓ ప్రయోగం చేశాడు.కానీ ఆ ప్రయోగం ఎలా ఫెయిల్ అయ్యిందో అందరికి తెలుసు.ఇక ఈ సారి మంచు హీరో విష్ణు ఈ సారి భక్త కన్నప్ప అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.ఈ సినిమాని ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే భారీ బడ్జెట్ తో కూడా తెరకెక్కిస్తున్నారు.ఇక భక్త కన్నప్ప సినిమాలో శివుడు పాత్ర ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే, ఆ శివుడి పాత్ర కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ని ఎంచుకోవాలని మంచు విష్ణు భావిస్తున్నారట. ఈ మేరకు నెట్టింట ప్రస్తుతం భారీగా ప్రచారం జరుగుతోంది. శివుడిగా గతంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు సూపర్ గా అదరగొట్టారు. ఇప్పుడు ఈ పాత్రను ప్రభాస్ ఖచ్చితంగా చాలా బాగా చేయగలడు అని మూవీ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే పార్వతీ దేవి పాత్రకు మాత్రం లేడీ సూపర్ స్టార్ నయనతారను కూడా ఎంచుకోవాలని అనుకుంటున్నారు.


ఎందుకంటే గతంలో సీత పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది. అందుకే ప్రభాస్ శివుడి పాత్రకి జోడీగా ఆమెను పార్వతీ దేవిగా తీసుకోవాలని అనుకున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదించారని కూడా సమాచారం తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటి దాకా అధికారిక ప్రకటన రాలేదు.మరి, ఈ రోల్స్ చేయడానికి ప్రభాస్, నయనతార లు అంగీకరిస్తారో లేదో చూడాలి. ఇక ఇదిలా ఉండగా, గతంలో ప్రభాస్ , నయన తారలు యోగి సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 16 సంవత్సరాలు అవుతోంది. కన్నడ సినిమా జోగికి రీమేక్ ఇది.తల్లి సెంటిమెంట్ తో సాగే కథ ఇది. అయితే సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి అసలు నటించింది లేదు.మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత వీరి ఇద్దరి కాంబినేషన్ వినిపించడంతో అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు నయనతార ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇది నిజమైతే మంచు విష్ణుకి గుడి కట్టేస్తామంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: