అన్నీ అనుకున్నవి అనుకున్న విధంగా జరిగి ఉంటే ఈపాటికి తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్లు ‘సలార్’ మూవీతో హడావిడి చేస్తూ ఉండేవి. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడటంతో ఈ మూవీ విడుదల తేదీ గురించి ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ మూవీ పై ఇప్పుడు హడావిడి చేస్తున్న ఒక షాకింగ్ రూమర్ ఫిలిమ్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.



హడావిడి చేస్తున్న ఈ వార్తల ప్రకారం ఈ మూవీ దర్శకులు ప్రశాంత్ నీల్ ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ను మళ్ళీ రీ ఘాట్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నట్లు వార్తల హడావిడి జరుగుతోంది. దీనికితోడు ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ క్వాలిటీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు పూర్తిగా నచ్చకపోవడంతో ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ మళ్ళీ మరో సంస్థతో చేయించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు అంటూ వార్తలు కూడ వస్తున్నాయి.





ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ లేకుండానే కొన్ని సీన్స్ ను రీ ఘాట్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తన మోకాలు ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్లడంతో ప్రభాస్ తిరిగి పరిపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి రావడానికి కనీసం రెండు మూడు నెలలు పడుతుంది అంటున్నారు. దీనితో ప్రభాస్ తిరిగి వచ్చిన తరువాత మాత్రమే ఈమూవీ క్లైమాక్స్ రీ షూటింగ్ ఆలోచనలు ముందుకు కొనసాగుతాయి.



ప్రస్తుతం ఈ మూవీ రీ ఘాట్ పై వస్తున్న వార్తలు నిజం అయితే ఈమూవీ వచ్చే ఏడాది సమ్మర్ రేస్ లో మాత్రమే విడుదల అయ్యే ఆస్కారామ్ ఉంది అంటున్నారు. అయితే ఇప్పటికే వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ కు ప్రాజెక్ట్ కె రెడీ అవుతున్న పరిస్థితులలో ‘సలార్’ విడుదల మరింత ఆలస్యం అయినా ఆశ్చర్యం లేదు అని కూడ ప్రచారం జరుగుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: