సితార ఎంటర్టైన్మెంట్స్ తాజాగా నిర్మించిన యూత్ ఫుల్ క్రేజీ ఎంట్రైనర్ మ్యాడ్. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. రామ్ నితిన్, సంగీత శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక సునీల్ కుమార్, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా, చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సెప్టెంబర్ 26న 'నువ్వు నవ్వుకుంటూ' అంటూ సాగే మెలోడీ సాంగ్ విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు సంగీతం అందించగా, కపిల్ కపిలన్ ఆలపించారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సినిమా పట్ల
ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు అందరి ముందే ఓ ప్రామిస్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మూవీ టీంతో పాటు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో అనుదీప్ మాట్లాడుతూ.." డైరెక్టర్ కళ్యాణ్ నాకు పదేళ్లుగా ఫ్రెండ్. కళ్యాణ్ లో చాలా ఎనర్జీ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది. ఎప్పుడూ మంచి, మంచి కథలు రాస్తుంటాడు. ఈ సినిమా చాలా ఎనర్జీ తో చాలా హ్యూమర్ తో ఉంటుంది. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నాగోవంశీ గారు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. మీరందరూ అక్టోబర్ 6 థియేటర్లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు" పేర్కొన్నారు. అయితే అనుదీప్ మాట్లాడిన సమయంలో నిర్మాత నాగ వంశీ కాసేపు యాంకర్ అవతారం ఎత్తారు."
మీరు సినిమా చూశారు కదా, 'మ్యాడ్', 'జాతి రత్నాలు' ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ బావుంది" అని నాగ వంశీ అడగగా.." 'మ్యాడ్' సినిమానే ఎక్కువ బాగుంది. నాకు బాగా నచ్చిందని" అనుదీప్ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత నాగ వంశీ మాట్లాడుతూ.." మ్యాడ్ సినిమా చూసి జాతి రత్నాలు కంటే ఒక్కసారి అయినా తక్కువ నవ్వానని ఎవరైనా చెప్తే వాళ్ల టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం. అలా ఎవరు సోషల్ మీడియాలో నాకు రుజువు చేసిన యాంకర్ సుమ సాక్షిగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తా. సినిమా పట్ల మాకు అంత నమ్మకం ఉంది. ఇది యూత్ ఫుల్ సినిమా అయినప్పటికీ కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుందిఅని అన్నారు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి