
2021లో పుష్ప అఖండ వంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.. 2022లో ధమాకా, హీట్ -2 వంటి చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. కానీ ఒక్కసారిగా ఈ ఏడాది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డిసెంబర్లో ఒక బాక్స్ ఆఫీస్ వార్ జరగబోతుందని చెప్పవచ్చు. తెలుగు సినిమాలే కాకుండా పలు క్రేజీ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లను సైతం అనౌన్స్మెంట్ చేశారు. వాటి గురించి చూద్దాం.
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక నటిస్తున్న యానిమల్ సినిమా డిసెంబర్ ఒకటవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 15న విడుదల కాబోతోంది. నాని మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న హాయ్ నాన్న చిత్రం డిసెంబర్ 21న అన్ని భాషలలో విడుదల కాబోతోంది. వెంకటేష్ నటించిన భారీ యాక్షన్ చిత్రం సైందవ్ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సుధీర్ బాబు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరోం హర ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన డుంకి చిత్రం కూడా డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కూడా డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. నితిన్ నటిస్తున్న ఎక్స్ట్రార్డినరీ సినిమా కూడా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశ్వక్ నటిస్తున్న గ్యాంగ్ సాఫ్ గోదావరి సినిమా కూడా డిసెంబర్ 9న రిలీజ్ కాబోతోంది.