
.png)
2015లో హరితేజ, దీపక్ అనే ఒక కన్నడ వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి భూమి అనే కూతురు కూడా ఉన్నది.. అలా బిడ్డ పుట్టిన తర్వాత బరువు పెరిగిన హరితేజ కష్టపడి బరువు తగ్గి మరి నాజుగ్గా తయారయింది.అప్పుడప్పుడు పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు.గత కొద్దిరోజులుగా హరితేజ విడాకులు తీసుకోబోతోందని వార్తలు వినిపించాయి. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించగా ఆమెను డైరెక్ట్ గా ఈ ప్రశ్న అడిగేశారు. దీంతో హరితేజ ఈ వార్తల పైన స్పందిస్తూ తను నాలుగు రోజులు సోషల్ మీడియాలో కనిపించకపోవడంతో చంపేసేలా ఉన్నారు.. ఇలా ఏవేవో వార్తలు రాస్తున్నారని తెలిసి వెంటనే తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేయడం జరిగింది హరితేజ. ఎట్టకేలకు విడాకుల రూమర్లపై క్లారిటీ ఇచ్చింది హరితేజ.