
ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ హీరోహీరోయిన్లు రొమాంటిక్ లుక్ ను కూడా విడుదల చేశారు. కొత్త తేదీ కానీ అపరిమిత వినోదం పక్కా.. అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. అలాగే ఈ సినిమాకి అమ్రీష్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.అందులోను సుగంధాల గాలి పంచే సాంగ్ మరింత ట్రెండింగ్ గా నిలిచింది. ఈ పాటలో నేహా శెట్టి అందాల ఆరబోత మరింత హైలైట్ అని చెప్పొచ్చు.ఈ సినిమాలో నేహా శెట్టి తన దైన నటనతో పాటు అదిరిపోయే అందాలతో ప్రేక్షకులని మరింతగా ఆకట్టుకునేందుకు సిద్ధంగా వుంది.