త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాతో దేశ విదేశాల్లో జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. అలా ఇప్పుడు తన తదుపరి సినిమాల కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి సైతం ఎంట్రీ ఇస్తున్నారు. బీటౌన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలుపుతూ ఈ ప్రాజెక్ట్ అప్డేట్ విడుదల చేశారు హీరో హృతిక్ రోషన్. నీకోసం యుద్ధ భూమిలో ఎదురు చూస్తున్నాను అంటూ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఇప్పటికే సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన మరో వార్త వైరల్ అవుతుంది. తాజాగా సమాచారం మేరకు వార్ 2 లో మాత్రమే కాకుండా మరో భారీ ప్రాజెక్టులో భాగమవుతున్నారట. అదే టైగర్ 3. సల్మాన్ ఖాన్ నటిస్తున్న టైగర్ 3 లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని అత్యంత విజయవంతమైన సినిమాగా చేయడానికి ఒకే సినిమాలో ఇద్దరూ స్టార్ హీరోలని పెట్టి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . అటు సౌత్ ప్రేక్షకులను సైతం మెప్పించడానికి వార్ 2 నుండి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని సైతం త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: