టాలీవుడ్ యంగ్ హీరో లలో ఒకరైన రామ్ నటించిన ది వారియర్, స్కంద సినిమా లకు నిర్మాత ఒక్కరే అనే సంగతి తెలిసిందే. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమా లను నిర్మించారు.అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదు. ఈ నిర్మాత నిర్మించిన సీటీమార్, కస్టడీ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. సమంత నటించిన యూటర్న్ మాత్రమే మెరుగైన ఫలితాన్ని అందుకుంది.

ఒక నిర్మాతకు వరుసగా నాలుగు డిజాస్టర్లు అంటే ఆ నిర్మాత కోలుకోవడం సులువు కాదనే సంగతి తెలిసిందే. శ్రీనివాస్ చిట్టూరి మంచి కాంబినేషన్ల లో సినిమాలను ప్లాన్ చేస్తున్నా కథ, కథనం విషయంలో పొరపాట్లు చేస్తుండటం తో సినిమాలు ఫ్లాపవుతున్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ సినిమాలకు మార్కెట్ ను మించి నిర్మాతలు ఖర్చు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. రామ్ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా ఇతర భాషల్లో సక్సెస్ సాధించాలన్న రామ్ ఆశలు సైతం నెరవేరడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సోషల్ మీడియా లో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న రామ్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనా లను సృష్టిస్తారని చెప్పవచ్చు.

ఇస్మార్ట్ శంకర్ సినిమా కు సైతం యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అదుర్స్ అనేలా వచ్చాయి. నవ్యత ఉన్న కథాంశం తో తెరకెక్కడం ఈ సినిమా కు ప్లస్ అయింది. రామ్ భవిష్యత్తు సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం కేసుకుంటాయో చూడాల్సి ఉంది. రామ్ భవిష్యత్తు సినిమాల పైనే అభిమానులు పూర్తిస్థాయి లో ఆశలు పెట్టుకోగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఆ ఆశలను నెరవేరుస్తాయో లేదో చూడాల్సి ఉంది. జయాపజయాల తో సంబంధం లేకుండా రామ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: