ఇకపోతే ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా తమన్న నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కంటెంట్ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావలసి ఉన్నప్పటికీ డిజాస్టర్ గా నిలవడానికి కారణం తమన్నా నటన అని చెప్పాలి. ఈ సినిమాలో తమన్నా కాస్త ఓవర్ యాక్షన్ కారణంగా ప్రేక్షకులు ఈ సినిమాని యాక్సెప్ట్ చేయలేకపోయారు ఇలా ఈ సినిమాకు తమన్నా నటన మైనస్ పాయింట్ కాగా సెకండాఫ్ లోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఆకట్టుకునే లేకపోవటం వల్ల ఈ సినిమా ప్లాప్ రిజల్ట్ అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా కనిపించింది.
ఈయన లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఎన్టీఆర్ యాక్షన్ డైలాగులు అదిరిపోయాయని.. పాటలు కూడా బాగున్నా కేవలం ఫ్లాష్ బ్యాక్.. ఇటు తమన్నా పాత్ర బిహేవియర్ వల్లే సినిమా చతికిల పడిందని చెబుతూ ఉంటారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంలో విఫలమైందని చెప్పాలి అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 12 సంవత్సరాలు పూర్తి కావడంతో మరోసారి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఒకవేళ తిరిగి విడుదలైనప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తుందా లేక అలాంటి కలెక్షన్లతోనే సరిపెడుతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ఎన్టీఆర్ అదే నిర్మాతతో నాన్నకు ప్రేమతో సినిమా చేశారు ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు . ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి