తెలుగు చిత్ర పరిశ్రమ లో టాప్ రెమ్యూనిరేషన్ అందుకునే హీరోల లో మహేష్ బాబు కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ఎంతో మంది అమ్మాయిలకు కలల రాకుమారుడు గా ఉన్నాడు అని చెప్పాలి. అయితే మహేష్ బాబు వయస్సు పెరుగుతుంది తప్ప ఆయన అందం మాత్రం పాతికేళ్ల దగ్గర ఆగిపోయిందేమో అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది.


 ఇంకా చెప్పాలంటే ఆయన వయసు పెరుగుతున్న కొద్ది.. ఇంకా హ్యాండ్సమ్ గా మారిపోతూ ఉన్నాడు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకే మహేష్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా అస్సలు వెనకడుగు వేయరు. పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్ శ్రీమంతుడు లాంటి సినిమాల తర్వాత మహేష్ డిమాండ్ మరింత పెరిగిపోయింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళితో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అధికారికంగా ప్రారంభం కాబోతోంది.


 రాజమౌళి సినిమాలు అంటే భారీ బడ్జెట్ ఉండడం కామన్. ఇక మహేష్ సినిమా కోసం కూడా ఇలాంటి భారీ బడ్జెట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు మునుపేన్నడు  తీసుకోనంత పారితోషకం తీసుకుంటున్నాడు. ఏకంగా 110 కోట్ల రూపాయలు అందుకొనున్నాడు అన్న వార్త ఇండస్ట్రీని ఊపేస్తోంది. అయితే టాలీవుడ్ హీరోలు తీసుకునే పారితోషకంతో పోల్చి చూస్తే ఇది నిజంగా భారీ మొత్తమే అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం త్రివిక్రమ్ తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 78 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: