బిగ్ బాస్ 5, బిగ్ బాస్ 6 లతో విసిగిపోయిన జనాలకి బిగ్ బాస్ 7 మీద పూర్తిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఒకలాంటి నెగెటివిటీ కూడా ప్రారంభమైంది. అయితే బిగ్బాస్ సెవెన్ డిఫరెంట్ గా వస్తుంది అంటూ షో నిర్వాహకులు చెప్తున్నప్పటికీ ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే షో ప్రారంభమైన దగ్గరనుంచి డిఫరెంట్ టాస్కులు, డిఫరెంట్ ఎలిమినేషన్ ప్రక్రియలతో నిజంగానే ప్రేక్షకుల మనసు దోచుకుని ఒక రేంజ్ లోదూసుకుపోతుంది బిగ్ బాస్. సక్సెస్ఫుల్ గా ఏడవ వారం ఎలిమినేషన్స్ పూర్తి చేసుకొని 8వ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా తాను నామినేట్ చేయాలి అనుకుంటున్న ఇద్దరు ఫోటోలను మంటల్లో కాల్చి అందుకు తగిన సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని బిగ్ బాస్ సూచించాడు.  అయితే అందరికంటే ముందుగా గౌతమ్ కృష్ణ నామినేట్ చేసే సమయంలో చెప్పిన పాయింట్స్ అందర్నీ ఆలోచించేలాగా చేశాయి అతను ముందుగా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ సందీప్ మాస్టర్ విషయంలో నువ్వు మాట మార్చడం నాకు నచ్చలేదు, దాని గురించి నాగార్జున సార్ అడిగినప్పుడు ఆయన ముందు డిఫైన్డ్ చేసుకో లేకపోవడం కూడా నాకు నచ్చలేదు అంటూ సరైన రీజన్ చెప్పాడు గౌతమ్.

 అయితే అందులో నిజం ఉండడం మూలాన పల్లవి ప్రశాంత్ ఏమి మాట్లాడలేకపోయాడు. కానీ అది ఎప్పుడో జరిగిపోయిన విషయం. అందుకోసం నేను సందీప్ మాస్టర్ కి ఎప్పుడో సారీ చెప్పాను అంటూ తనదైన లెవెల్లో వాదనకు దిగాడు  ప్రశాంత్. కానీ ప్రశాంత్ మాత్రం చాలా ప్రశాంతంగా నువ్వు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు నాగార్జున సార్ అడిగినప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉన్నావు, అదంతా యాక్టింగ్ గా, నా ముందు నటించకు.

 నేనేమీ ఆడిషన్స్ తీసుకోవట్లేదు అంటూ పల్లవి ప్రశాంత్ నోరు మూయించాడు గౌతమ్. అలాగే రెండవ నామినేషన్ లో భాగంగా బోలే షావలిని నామినేట్ చేశాడు. టాస్క్ లో ఫిజికల్ గా వీక్ గా ఉన్నారు అనిపించింది అందుకే నామినేట్ చేశాను అని రీజన్ చెప్పాడు అయితే షావలి మాత్రం నువ్వు డాక్టర్ వి అయితే చేయి పట్టుకొని బీపీలు చూడు అంటూ తిక్కగా మాట్లాడాడు. షావలి, గౌతమ్ ప్రొఫెషన్ పై కామెంట్స్ చేశాడు. తనదైన మెచ్యూర్డ్ మెంటాలిటీతో ప్రశాంత్ నిజ స్వరూపం బయట పెట్టాడు గౌతమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: