కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దళపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన లియో మూవీ అక్టోబర్ 19న పాన్ ఇండియాలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ పోస్టర్లు విడుదల అయినప్పటి నుండి ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు నెలకోన్నాయి. కానీ విడుదలైన తరువాత మాత్రం యావరేజ్ టాక్ ను అందుకుంది. ఖైదీ విక్రమ్ రేంజ్ లో లేదు అని సినిమా చూసిన వాళ్ళందరూ కామెంట్లు చేశారు. కానీ తలపతి విజయ్ మాత్రం తన పాత్రలో జీవించేసాడు అని అంటున్నారు మూవీ లవర్స్. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా కానీ కలెక్షన్స్ లో మాత్రం దుమ్ము రేపుతోంది. 

లియో మొదటి రోజు రూ.140 కోట్ల గ్రాస్ అందుకొని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కోలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా 'లియో' సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కేవలం కోలీవుడ్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్స్ తో రన్ అవుతుంది. ఇలాంటి తరుణంలో 'లియో' ఓటీటీ స్ట్రీమింగ్ కి సంబంధించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. 'లియో' ఓటీటీ రైట్స్ ని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. దాని ప్రకారం నవంబర్ 21 నుండి లియో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. 

అంతేకాదు ఈ ఓటీటీ అగ్రిమెంట్ కారణంగానే హిందీ నేషనల్ మల్టీప్లెక్స్ లో సినిమా రిలీజ్ కాలేదు. అక్కడ రూల్ ప్రకారం థియేటర్ రిలీజ్ కు ఓటీటీ రిలీజ్ కు మధ్య కనీసం ఆరువారాల గ్యాప్ ఉండాలి. కానీ మూవీ యూనిట్ భారీ ధరకు లియో ఓటీటీ రైట్స్ ని అమ్మేసి నాలుగు వారాల్లోనే ఓటీటీ రిలీజ్ కి అగ్రిమెంట్ చేసుకుంది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: