'మరోసారి నవ్వులు పూయిస్తూ చరిత్ర సృష్టించడానికి 'టిల్లు స్వ్కేర్‌' వచ్చేస్తున్నాడంటూ కొత్త రిలీజ్ డేట్ను మూవీటీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 వ తేదీన రానున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడీ సినిమాకు ఓ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఖచ్చితంగా సినిమా  బ్లాక్ బాస్టర్ అవుతుందని అంతా ఆశిస్తున్నారు. అయితే అదే అది వర్కౌట్ అవ్వకపోతే మాత్రం.. గట్టి దెబ్బ పడే అవకాశముంటుంది.పూర్తి వివరాళ్లకి వెళితే.. సాధారణంగా ఫిబ్రవరి బాక్సాఫీస్ అంటే చాలా తక్కువగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఎందుకంటే ఆ సమయంలో విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు చాలా తక్కువగా వస్తుంటారు. అందుకే దర్శకనిర్మాతలు ఎక్కువగా సినిమాలని ఆ టైంలో రిలీజ్ చేయరు.అయితే గత 5 సంవత్సరాలుగా ఆ లెక్క మాత్రం మారుతూ వస్తోంది. ఆ నెలలో వచ్చే కొద్ది చిత్రాల్లో ఏదో ఒకటి బ్లాక్ బాస్టర్ హిట్ అయి మంచి వసూళ్లనే అందుకుంటున్నాయి.


డీజే టిల్లూ.. 2022 ఫిబ్రవరిలో విడుదల అయ్యి ఓ ఊపు ఊపేసింది. 2021 ఫిబ్రవరిలో ఉప్పెన సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2020 ఫిబ్రవరిలో కూడా నితిన్ హీరోగా వచ్చి భీష్మ సినిమా సూపర్ హిట్టయింది. ఇక 2017 న్యాచురల్ స్టార్ నాని నేను లోకల్, 2018 వరుణ్ తేజ్ తొలి ప్రేమ ఇంకా నాగశౌర్య ఛలో.. అలా గడిచిన ఐదేళ్లలో ఏటా ఫిబ్రవరికి మీడియం రేంజ్గా వచ్చిన సినిమాల్లో ఓ హిట్ సినిమా పడుతోంది.ఇక 2024లో అయితే క్రేజీ సీక్వెల్ టిల్లు స్క్వేర్ రాబోతుంది. మేకర్స్ ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాగే తొలి భాగం సెన్సేషనల్ హిట్ కావడంతో రెండో భాగంపై కూడా ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో ఫిబ్రవరి సెంటిమెంట్తో టిల్లు సినిమా కూడా మంచి హిట్ కొట్టే ఛాన్స్ ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఓకే కానీ టాక్ తేడా కొడితే మాత్రం చాలా దారుణంగా గట్టి దెబ్బ తగిలే అవకాశముంటుంది. చూడాలి మరి ఈ సినిమా హిట్ కొడుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: