ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ‘మంగళవారం’ మూవీ నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈమూవీకి సంబంధించిన లేటెస్ట్ ట్రైలర్ విడుదల అయిన తరువాత ఒక్కసారిగా ఈమూవీ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటివరకు అందరూ భావిస్తున్నట్లుగా ఒక రెగ్యులర్ క్రైమ్ హారర్ మూవీ కాదనీ ఈమూవీ కధలో ఒక కొత్త విషయం ఉంది అన్న అంచనాలు ఈ మూవీ ట్రైలర్ చూసిన తరువాత అందరికీ కలగడంతో ఒక్కసారిగా ఈమూవీ బిజినెస్ రెట్టింపు అయింది అని అంటున్నారు.

నవంబర్ 17న చెప్పుకోతగ్గ సినిమాలు ఏమీ విడుదల లేకపోవడంతో ‘మంగళవారం’ మూవీ పై సగటు ప్రేక్షకులలోనూ అదేవిధంగా ఇండస్ట్రీ వర్గాలలోనూ ఈమూవీ పై ఆశక్తి ఒక్కసారిగా పెరిగి పోయింది.  ‘ఆర్ ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుట్ నటిస్తున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కథలో చాల ట్విస్ట్ లు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాకు సంబంధించిన పబ్లిసిటీలో ఈమూవీ కథకు సంబంధించిన లీకులు బయటకు రాకుండా దర్శకుడు అజయ్ భూపతి అనుసరిస్తున్న వ్యూహాలు వల్ల ఈమూవీ పై మ్యానియా పెరిగింది అని అంటున్నారు.

ఒక ఊరిలో జరిగే అంతుచిక్కని హత్యలకు కనిపించని దెయ్యాలకు కామంతో రగిలిపోయే ఒక అమ్మాయికి మధ్య జరిగే సస్పెన్స్ థ్రిల్లర్  మూవీగా ఈమూవీ ఉంటుంది అని అంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా 5 భాషలలొ ఒకేసారి ఈసినిమాను విడుదల చేస్తారని అంటున్నారు.

దర్శకుడు అజయ్ భూపతి అదేవిధంగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ఒక సాలిడ్ హిట్ కావాలి.అలాంటి అదృష్టాన్ని వీరిద్దరికీ ‘మంగళవారం’ తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నారు. కథలో కొత్తదనం లేకుండా కేవలం దెయ్యాలను నమ్ముకుని ప్రేక్షకులను భయపెడదాము అనుకుంటే అన్ని సందర్భాలలోను అవి కలిసిరావు. తెలంగాణ రాష్ట్రం అంతా ఎన్నికలహడావిడి మధ్య నవంబర్ నెల గడిచిపోయే నేపధ్యంలో ఈ ‘మంగళవారం’ ను ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: