అంతేకాకుండా ఈసినిమా మొదటి వారం రోజులకు టిక్కెట్ల ధర పెంపుకు అనుమతులు ఇవ్వాలని నిర్మాతలు ప్రభుత్వ పెద్దలను కోరే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈ వార్తలు ఇలా కొనసాగుతూ ఉండగా ఈమూవీ క్లైమాక్స్ లో ‘కేజీ ఎఫ్’ హీరో ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కలిసి కొన్ని నిముషాల పాటు కనిపిస్తాడాని కన్నడ మీడియా వార్తలు రాస్తోంది.
అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన నిర్మాతల నుండి లేకపోవడంతో ఈవార్త నిజంగా యాదార్థమా లేదంటే సోషల్ మీడియా గాసిప్ అనుకోవాల అన్న కన్ఫ్యూజన్ లో ప్రభాస్ అభిమానులు ఉన్నారు. ఆమధ్య విజయ్ నటించిన ‘లియో’ లో మూవీలో రామ్ చరణ్ అదేవిధంగా ‘టైగర్ 3’ లో జూనియర్ ఎన్టీఆర్ అతిధి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే అయితే అది ఏమాత్రం వాస్తవం కాదు.
ఇప్పుడు యష్ ‘సలార్’ లో కొద్దిసేపు కనిపించే విషయం కూడ అలాంటి గాసిప్ గా మారుతుందా అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ కు యష్ కు సాన్నిహిత్యం రీత్యా ఇలాంటి మ్యాజిక్ ఏదోఒకటి ‘సలార్’ లో ఉండినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే డిసెంబర్ 1న విడుదల అయ్యే ట్రైలర్ గురించి అందరు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి