ఈరోజు విడుదలవ్వాల్సిన 'ధృవ నక్షత్రం' సినిమా మళ్ళీ వాయిదా పడింది. స్వయంగా దర్శకుడు, నిర్మాత అయిన గౌతమ్ మీనన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉంది. కానీ ఈరోజు తెల్లవారుజామున గౌతమ్ ఒక ప్రకటన చేస్తూ, 'ఈరోజు 'ధృవ నక్షత్రం' సినిమాని థియేటర్స్ లోకి తీసుకురాలేకపోయినందుకు క్షమించండి. మాకు ఇంకో ఒకటి రెండు రోజుల సమయం పడుతుందని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని రోజుల్లో వచ్చేస్తాం, మీకు ఈ సినిమా అనుభూతిని మంచి థియేటర్స్ లో చూపిస్తాము,' అనుకుంటూ రాసుకొచ్చాడు.
ఈ సినిమాకి తమిళంలో 'ధృవ నచ్చతిరం' అని పెట్టారు. అయితే ముందుగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన ఈ సినిమా చాలా ఆలస్యం అయింది. ఇటీవల ఈ చిత్ర నిర్వాహకులు "ట్రైల్ బ్లేజర్" పేరుతో ఒక చిన్న ప్రోమోను విడుదల చేశారు, అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని కూడా అందరూ అంటున్నారు. ఈ సినిమాలో జాన్‌గా విక్రమ్ నటిస్తున్నాడు. ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇందులో విక్రమ్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్, దివ్యదర్శిని కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి