తమిళ హాట్ బ్యూటీ త్రిషపై సీనియర్ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగు సీనియర్ హీరో చిరంజీవి ఫైర్‌ అయిన సంగతి తెలిసిందే. త్రిషకు మద్దతు ప్రకటిస్తూ.. వక్రబుద్ది కలిగిన వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేస్తారంటూ..మన్సూర్‌ అలీఖాన్ ని విమర్శించాడు.అయితే అసలు విషయం ఏంటనేది పూర్తిగా తెలుసుకోకుండా తనను విమర్శించాడంటూ చిరంజీవిపై ఒక రేంజ్ లో మండిపడ్డాడు మన్సూర్‌ అలీఖాన్‌. ఇంకా అంతేకాదు త్రిష, కుష్భూలతో పాటు చిరంజీవిపై కూడా పరువునష్టం దావా వేశాడు. చిరంజీవి మీద ఏకంగా రూ. 20 కోట్లు, త్రిష కుష్బూల మీద రూ. 10 కోట్ల చొప్పున దావా వేస్తున్నట్టుగా తాజాగా మన్సూర్ అలీ ఖాన్ తెలిపాడు. ఇంకా ఇంతటితో ఆగకుండా.. చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలని కూడా చేశాడు. పార్టీ పెట్టి వేల కోట్లు సంపాదించుకున్నాడు కానీ పేదవాళ్లకు కొంచెం కూడా సహాయం చేయలేదని విమర్శించాడు.


'నాది వక్రబుద్ధి అని చిరంజీవి అన్నాడు కదా..మరి అతడు ఏం చేశాడు? పార్టీ పెట్టి వేల కోట్లు తిని పేదవారికి అతను సాయం చేయలేదు. అతడి తమ్ముడు పవన్ కళ్యాణ్ నాకు తెలీదు.. అతడు కూడా పార్టీ పెట్టాడు.. వీళ్లంతా ఏం చేస్తున్నారో నాకు తెలీదు.. ఆ డబ్బంతా కూడా కేవలం వాళ్ల కోసమే వాడుకుంటున్నారు. పైగా ప్రతి సంవత్సరం ఈ చిరంజీవి పాత హీరోయిన్లకు పార్టీ ఇస్తుంటాడు. అయితే ఆ పార్టీకి ఎప్పుడూ నన్ను పిలవలేదు అనుకోండి. అతడు కేవలం హీరోయిన్లకు మాత్రమే ఈ పార్టీ ఇస్తాడు. అది అతని ఇష్టం. కానీ నాపై విమర్శలు వచ్చినప్పుడు.. అసలు ఏం జరిగిందనే విషయాన్ని నాకు ఫోన్‌ చేసి తెలుసుకొని ఉంటే చాలా బాగుండేది. అలా కాకుండా అతను ఏదోదో మాట్లాడాడు. అవి నన్ను చాలా బాధించాయి. త్రిష, కుష్భూలపై రూ. 10 కోట్ల చొప్పున, ఇంకా చిరంజీవిపై రూ. 20 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. వచ్చిన డబ్బును తమిళనాడులో మద్యం దాగి చనిపోయిన కుటుంబాలకు అందజేస్తా'అని మన్సూర్‌ అలీఖాన్ అన్నారు. 


ప్రస్తుతం మన్సూర్‌ అలీఖాన్ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈయన చేసిన కామెంట్స్ కి నెటిజన్స్ మద్దతు తెలుపుతున్నారు. అయిపోయిన వివాదాన్ని కెలికి చిరంజీవి తప్పు చేశాడని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. త్రిష పై మన్సూర్ అన్న మాటలకు బదులుగా ఆయన సారీ కూడా చెప్పాడు. అంత అయిపోయి ప్రశాంతంగా ఉన్న టైంలో చిరంజీవి కెలికి మళ్ళీ వివాదం సృష్టించడం దేనికి అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దేశంలో ఇంతకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి. వాటి మీద లేని బాధ్యత ఒక హీరోయిన్ మీద ఎందుకు అని చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: