నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలామంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా హైదరాబాదులో పలు ఏరియాలలో ఓట్లు వేయడానికి వెళ్లడం జరిగింది.. అలా స్టార్ హీరోలైన చిరంజీవి, అల్లు అర్జున్, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు తదితర హీరోలు డైరెక్టర్లు సైతం ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లడం జరిగింది. చాలామంది సెలబ్రిటీలు సైతం షూటింగ్ సమయాన్ని ఆపివేసి మరి ఓటు వేయడానికి రావడం జరిగింది.

ముఖ్యంగా నందమూరి కుమారుడు మోక్షజ్ఞ  ఓటు వేయడానికి తన తల్లితో కలిసి కారులో నుంచి దిగి హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో తన ఓటు హక్కును ఉపయోగించుకోవడం జరిగింది. ప్రస్తుతం మోక్షజ్ఞ కు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. ఈ వీడియోలో చూసిన మోక్షజ్ఞను చాలా మంది సెలబ్రెటీల సైతం ఆశ్చర్యపోతున్నారు. గతంలో భగవంత్ కేసరి సినిమా షూటింగ్ సమయంలో మోక్షజ్ఞ చివరిసారిగా కనిపించడం జరిగింది. అప్పుడు కూడా గతంలో కంటే కాస్త బరువు తగ్గినట్లు కనిపించారని చెప్పవచ్చు.ఇక ఇప్పుడు ఒకేసారి చూస్తూ ఉంటే అంతకంటే మరింత సన్నగా కనపడ్డారు. దీంతో మోక్షజ్ఞ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మోక్షజ్ఞ సినిమా కోసమే ఇలా సన్నబడుతున్నారని వార్తలు కూడా ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతున్నాయి ఇటీవల బాలయ్య కూడా త్వరలోనే తన కొడుకుని హీరోగా లాంచ్ చేస్తానని హీరోయిన్గా శ్రీలీల ఉండవచ్చు అంటూ తెలియజేయడం జరిగింది. దీంతో నందమూరి వారసుడు కోసం నందమూరి అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మోక్షజ్ఞ ఇంతలా సన్నబడడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఏది ఏమైనా మోక్షాజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అందుకు సంబంధించి ఈ ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: