తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్ తాజాగా మంగళవారం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. ఇకపోతే ఈ మూవీ ఇప్పటి వరకు 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 14 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు 14 రోజుల్లో నైజాం ఏరియాలో 4.01 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.45 కోట్లు , యు ఏ లో 1.14 కోట్లు , ఈస్ట్ లో 68 లక్షలు, వేస్ట్ లో 47 లక్షలు , గుంటూరు లో 66 లక్షలు , కృష్ణ లో 48 లక్షలు , నెల్లూరు లో 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమా 14 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.29 కోట్ల షేర్ ... 17 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ కి 14 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 1.90 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇక ఈ మూవీ కి మొదటి 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల షేర్ ... 20.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు 12 కోట్ల మేర ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 13 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ లెక్కన బట్టి చూస్తే ఈ సినిమా మరో 1.91 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: