టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. ఇక ఆమెకి సంబంధించిన వర్కౌట్ వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి అని చెప్పొచ్చు. నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ప్రగతి తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే ఆమె గతంలో పంచుకున్న కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మాది హైదరాబాద్ అని.. పదో తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను అంటూ ఒకానొక ఇంటర్వ్యూలో తెలిపింది.  దాని తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యాము అని చిన్న

 వయసులోనే తండ్రిని కోల్పోవడం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ ఈ సందర్భంగా పేర్కొంది. ఆర్థికంగా అమ్మకు సహాయం చేయాలి అని కెరియర్ మొదట్లో కార్టూన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పేదాన్ని అని దానితోపాటు మైసూర్ సిల్క్ ప్యాలెస్ షోరూమ్ కోసం మోడల్గా కూడా పని చేశాను అని ఆ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు. అనంతరం దాదాపుగా ఎనిమిది సినిమాల్లో హీరోయిన్గా నటించాను అని తెలిపారు. ఆ తర్వాత ఒక సినిమాలో వాన పాట కాస్ట్యూమ్ విషయంలో గొడవ జరిగింది అని తర్వాత కోపంలో అక్కడి నుండి వెళ్లిపోయాను అని ఆ తర్వాత

మళ్లీ షూటింగ్ చేసాము అని ఈ సందర్భంగా వెల్లడించారు. పెళ్లి తర్వాత సినిమాల్లో ఆఫర్లు తగ్గాయని తమిళంలో పలు సీరియల్స్ లో నటించానని ఆమె అన్నారు. తన టాటూ గురించి సైతం ప్రగతి కీలక వ్యాఖ్యలు చేశారు. నా చేతిపై ఉండే టాటూకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదని చిన్నతనంలో ఒక వ్యాక్సిన్ సెప్టిక్ అయ్యి మచ్చ పడిందని ఆమె తెలిపారు. అది కనిపించకుండా ఉండేందుకు టాటూ వేయించానని ప్రగతి పేర్కొన్నారు. ఇక ప్రగతి కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం పలు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు. అప్పుడప్పుడు పలు సినిమాల్లో కూడా కనిపిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: