కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సినిమాలు విడుదలైన గత నాలుగేళ్ల క్రితం ఎవరు పట్టించుకోలేదు.. అయితే ఎప్పుడైతే ఈ హీరోల మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయిందో ఈ సినిమాలను తెలుగులో రీమిక్స్ చేస్తూ విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు.. ముఖ్యంగా కన్నడ సినీ పరిశ్రమను ఒక్కసారిగా మలుపు తిప్పేసిన డైరెక్టర్ హీరో ఎవరంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ అని చెప్పవచ్చు. kgf సినిమాతో ఒక్కసారిగా కన్నడ సినీ పరిశ్రమనే మలుపు తిప్పారు.ఈ సినిమా సీక్వెలతో ఏకంగా 1500 కోట్ల రూపాయలు కాబట్టి కన్నడ సినీ పరిశ్రమ రేంజిని మార్చేయడం జరిగింది.


ఆ తర్వాత పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన యష్..KGF -2 సినిమా భారీ విజయం అందుకోవడంతో ఆ తర్వాత తదుపరి చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నిన్నటి రోజున ఈ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే టాక్సిక్ అని చెప్పి టైటిల్ తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


యష్ దాదాపుగా ఒక సినిమా విడుదలైన తర్వాత మూడు సంవత్సరాల గ్యాప్ ఇచ్చి మరి ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ -2 సినిమా ఏప్రిల్ 14- 2022లో విడుదల కగా టాక్సిక్ అనే చిత్రం ఏప్రిల్ 10 2025 లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా టైటిల్ గ్లింపులో తెలియజేయడం జరిగింది. దీంతో అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుందని అనుకోగా దాదాపుగా ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి అంటే పలువురు అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల విషయాల గురించి ఇంకా తెలియజేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: