సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1 న పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో జోయా పాత్రలో తృప్తి దిమ్రి తన బోల్డ్ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా రణబీర్ తో ఈమె మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ షాక్ గురిచేసాయి. సినిమాలో తృప్తి ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయి మరి నటించింది. ముఖ్యంగా రణబీర్ కపూర్ తో ఓ సీన్లో బెడ్ పై సెమీ న్యూడ్ గా కనిపించి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తృప్తి దిమ్రి సినిమాలో 

ఇంటిమేట్ సీన్స్ చేయడంపై స్పందించింది." నిజానికి నెట్ ఫ్లిక్స్ మూవీ 'బుల్ బుల్' లో నేను చేసిన రేప్ సీన్ తో పోలిస్తే ఇదేం పెద్ద కష్టం అనిపించలేదు. ఆ రేప్ సీన్ చేయడానికి సిద్ధపడడం నాకు సవాల్ గా అనిపించింది. కానీ యానిమల్ లో అలాంటి సీన్స్ చేయడం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు" అంటూ చెప్పింది. అంతేకాకుండా యానిమల్ మూవీలో బోల్డ్ సీన్స్ చేసే రోజు షూటింగ్ ఎలా సాగిందో కూడా చెప్పుకొచ్చింది." ఆరోజు నేను, రణబీర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, సినిమాటోగ్రాఫర్ మాత్రమే సెట్ లో ఉన్నాం. ప్రతి ఐదు నిమిషాలకోసారి వాళ్లు బాగానే ఉన్నావా అని అడిగారు. 

ఏమైనా కావాలా అని అడిగారు. దీంతో నేను ఏమాత్రం అసౌకర్యంగా ఫీల్ అవ్వలేదు. కానీ రణబీర్ తో కలిసి నటించాలంటే మొదట్లో కొంత ఆందోళనకు గురయ్యాను" అని చెప్పింది. ఇక సినిమాలో రణబీర్ తో ఓ సన్నివేశంలో అతని షూస్ నాకే సీన్ పై వచ్చిన విమర్శలపై మాట్లాడుతూ.." అది నా యాక్టింగ్ కోచ్ నాకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. మన పాత్రను జడ్జ్ చేయకూడదు అన్నది గోల్డెన్ రూల్. మనం పోషించే పాత్రలు మన కోస్టార్స్ పోషించే పాత్రలు కూడా మనుషులే. మనుషుల్లో మంచి చెడు రెండు ఉంటాయి. అన్ని పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే అదే మనసులో పెట్టుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది తృప్తి. 


మరింత సమాచారం తెలుసుకోండి: